-ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా వ్యవస్థ పై అధ్యయనం కోసం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ భువనేశ్వర్ లో సోమవారం పర్యటిoచింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికారెడ్డి నేతృత్వంలో సభ్యులు భువనేశ్వర్ లో సోమవారం పర్యటిస్తున్నారు. ఒడిస్సా మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్
పోమాతుడు, ఇతర అధికారులతో వారి కార్యాలయoలో సభ్యులు సమావేశమయ్యారు. సర్వీస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి సుమారు రూ. 750కోట్ల రూపాయలతో మందులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. బోధన్నాసుపత్రుల్లో 30%, ఇతర ఆసుపత్రుల్లో 10% లోకల్ గా కొనుగోళ్లు జరుగుతున్నాయని సర్వీస్ కార్పొరేషన్ ఎండీ చెప్పారు. మందుల పంపిణీదారులకు నెల నుంచి రెండు నెలల్లోగా బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. భువనేశ్వర్ లో ప్రభుత్వ క్యాపిటల్ హాస్పిటల్, మందుల గిడ్డంగిని సభ్యులు సందర్శించారు. కమిటీలో వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి గణపతి రావు, గుంటూరు ggh సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్, Apsmidc Drug wing incharge Sadhu srinivas rao, pharmacy ఆఫీసర్స్ y. Padma Meenakshi, srinivas, APSMIDC Sr project manger aswini ఉన్నారు.
Prajavartha Online Telugu News