విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, నవంబర్ 17న హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చేరిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ వైద్యపరంగా మెరుగుపడుతున్నారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ప్రాణాధారాలను కొనసాగిస్తున్నారని, ఏఐజి హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సిసోడియా పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …