విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కీటక జనిత వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని విజయవాడ, మలేరియా సబ్ యూనిట్-5 అధికారి అన్నారు. స్థానిక విజయవాడ, కేదరేశ్వరపేట, సచివాలయం 225 నందు కీటక జనిత వ్యాధులపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ ఫైవ్ అధికారి K. రాజాంరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృం భించే అవకాశం ఉందన్నారు. దోమల వ్యాప్తిని కీటక జనిత వ్యాధులను నియంత్రించటం ద్వారా అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ -5 హెల్త్ సూపర్వైజర్ వి వి ఎస్ ఎన్ బాబు,పి బి శ్రీనివాస కుమార్,జి రమేష్, సబ్ యూనిట్ -5 పరిధిలో ఉన్న ఉమెన్ హెల్త్ సెక్రటరీలు, ఆశా వర్కర్స్ మరియు పిడిపి సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …