Breaking News

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ఏపీసీసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్‌లకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోలనుకొండ శివాజీ మాట్లాడుతూ, విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ, పేపర్ లీక్‌లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి.గురునాధం, షేక్ ఖుర్షిదా, లక్కరాజు రామారావు, మన్నం రాజశేఖర్, అన్సారీ,  పి.వై.కిరణ్, సీరం నాగమల్లేశ్వర రావు, గోళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *