Breaking News

మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్తి యువ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ సంబంధించిన మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్తి యువ కార్యక్రమం జరగనున్నది. కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 అనగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సుమారు పదివేల చోట్ల దాదాపు కోటి మంది యువతతో ఆన్లైన్ మాధ్యమంలో ముచ్చటించనున్నారు. యువత అందరూ కలిసి సామూహికంగా నషాముక్తి ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో లోక్ భవన్ లో గవర్నర్ తో కలిసి మైభారత్ కార్యకర్తలు నషాముక్తి ప్రతిజ్ఞ చేయనున్నారు. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ మాధ్యమంలో వీక్షించి వికసిత్ భారత్ కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించవలసిందిగా జిల్లా యువజన అధికారి బి.ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *