వివిధ బ్యాంక్ లకు అలాట్ చేసిన టిడ్కొ గృహాల లబ్ధిదారులు గ్రౌండింగ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి…

-మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం మల్లయపాలెం లేఅవుట్ లో పూర్తయిన 3200 టిడ్కొ లబ్ధిదారులకు, ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా, ప్రణాళిక బద్దంగా గ్రౌండింగ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో బుధవారం టిడ్కో గృహాల లబ్ధిదారులకు మెప్మా అధికారుల పర్యవేక్షణలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. ఈసందర్బంగా కమీషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు ముందుకు వచ్చిన బ్యాంకుల ప్రతినిధులతో గ్రౌండింగ్ మేళాను, లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాక్, బ్యాంక్ ఆఫ్ భరోడా, ఎస్.బీ.ఐ.బ్యాంకులు 219 లబ్దిదారులుకు రూ.3 కోట్ల 15 లక్షలు రుణ సౌకర్యం కల్పించాయన్నారు. టిడ్కోలో 430 చ.అ.గల ప్లాట్ కి రూ.3 లక్షల 65వేలు, 365 చ.అ.గల ప్లాట్ కు రూ.3 లక్షల 15 వేల రూపాయలను లబ్దిదారులు అలాట్ అయిన ఆయా బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసాయన్నారు. ఈ రోజు కెనరా బ్యాంకు అలాట్ అయిన 284 మంది లబ్దిదారులకు డాక్యుమెంటేషన్ చేయడం జరిగిందన్నారు. నవంబరు 25 వ తేదీ గురువారం కైకాల సత్యనారాయణ ఆడిటోరియంలో కెనరా బ్యాంక్(సిండికేట్) కు అలాట్ అయిన లబ్దిదారులు గ్రౌండింగ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రమాదేవి, మెప్మా సి ఎం ఎం పివీ శ్రీధర్,టెక్నికల్ ఎక్సపర్టర్ సుజాత, కెనరా బ్యాంకు ప్రతినిధులు, మెప్మా సిబ్బంది ,పలువురు టిడ్కొ గృహాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *