విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ మండలంలో 121 సచివాలయాన్ని సబ్‌కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ శనివారం తనిఖీ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు కొత్త సేవలను పెంచడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, స్పందన అర్జీల రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయట ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయం పరిధిలో 18 సంవత్సరాల నుంచి 45 సం ల లోపు ఉన్న వారు, గర్భవతులు అందరికీ మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ వేయించాలని ఏఎన్ ఎం కు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్‌టైమ్ సెటిల్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.సచివాలయ పరిధిలో జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు సర్వే చేశారు, వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఎన్ని చేశారు వంటి వివరాలను విఆర్ ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు .జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నూరు శాతం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని వేగవంతం చేయాలన్నారు. 1983 నుంచి 2011 వరకూ వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా రుణాలు తీసుకొని, ఇళ్లు నిర్మించుకున్నవారికి, ఒన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఆయా ఇళ్లు, స్థలాలను తమ పేరుమీద రిజిష్టర్ చేసుకొనే గొప్ప అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని, తద్వారా దానిపై సంపూర్ణ హక్కులు కలుగుతాయని తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల డేటా ఎంట్రీ పై దృష్టి సారించేలా చేసి డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లాగిన్ లో ఉన్న లబ్ధిదారుల జాబితాను కూడా వెంటనే అప్రూవల్ చేయాలన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …