ఏ .కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. ఏ .కొండూరు మండలం ఏ .కొండూరు తండా లోని గ్రామ సచివాలయాన్ని శనివారం జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సచివాలయంలో సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదవారికి అందించేందుకు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారన్నారు. సంక్షేమ ఫలాలు నూరుశాతం అర్హులైన లబ్దిదారులకు అందేలా సచివాలయ వాలంటీర్లు కృషి చేయాలన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు సంబంధించి ఏ ఏ సంక్షేమ పథకాలకు అర్హులో గుర్తించి, ఆయా పధకాలు పేదలందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పధకాలను పొందిన లబ్ధిదారుల జాబితాను పధకాల వారీగా సచివాలయ నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో రైతులందరి వివరాలను ఈ-క్రాప్ లో నమోదు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట సచివాలయ సిబ్బంది, రైతుభరోసా కేంద్రం సిబ్బంది , ప్రభృతులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …