విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పేదల పెన్నిధి, నిస్వార్థ ప్రజా నాయకుడు, కీర్తిశేషులు మరుపిళ్ళా చిట్టి 124వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, సామాన్యుల సొంత ఇంటి కల సాకారం కోసం, నిరంతరం కృషి చేసిన ప్రజా నాయకుడని, పాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున భూములు విరాళం ఇచ్చారని, కానీ నేడు నాయకులు సమాజహితం.కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం ప్రభుత్వ భూములను మరియు ప్రైవేటు భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అటువంటి భూకబ్జా నాయకులు కుట్రలను, కుతంత్రాలను గుర్తుంచుకొని తగిన గుణపాఠం చెప్పాలని అదేవిధంగా మరుపిళ్ళా చిట్టి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించిన మార్గంలో ప్రయాణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోబ్బూరి కొండలరావు,k.s.n మూర్తి , ఖలీల్,మునవార్. సుల్తానా, పిర్ధోస్.సుల్తానా హరికృష్ణ , పొట్నురి శ్రీనివాస్,పొట్నురి ప్రసాద్, సతీష్, కోటేశ్వరరావు , సోము మహేష్ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …