విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామవరప్పాడులో నూతనంగా ఏర్పాటుచేసిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ మంత్రి అంజద్ బాషా, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ మంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల సమస్యల పరిష్కరించేందుకు హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో కార్యాలయాన్ని ఏర్పాటుచేసిన నూరుద్దీన్ను అభినందించారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమమే లక్ష్యం సీఎం జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల పదవుల్లోనూ మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. మైనార్టీలను పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ మాత్రమేనని విమర్శించారు. అసలు మైనార్టీ మంత్రి లేకుండా ఐదేళ్లు పాలన సాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మైనార్టీ మహిళకు కేటాయించారని గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమానికి గత టీడీపీ ప్రభుత్వం 2,660 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, రెండున్నరేళ్లలోనే తమ ప్రభుత్వం 7,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి కేటాయించలేదని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి మైనార్టీల పక్షపాతిగా వ్యవహరిస్తూ అన్ని పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు నూరుద్దీన్ ముస్లిం రైట్స్ అండ్ వెల్పేర్ సంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. సంస్థ నిర్వాహకులు ఎస్.నూరుద్దీన్ మాట్లాడుతూ ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తన శక్తివంచన లేకుండా మైనార్టీల సమస్యలు పరిష్కరించేందుకు, హక్కులను పరిరక్షించి ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను ప్రోత్సహించి, సహాయ సహకారాలు అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …