విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలో తెలుగువారి కోసం ఏర్పడి తొలి నాటి నుంచి ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ TANA (Telugu Association of North America ). రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు అక్కడ వారి కోసమే కాకుండా మన దేశంలో ఉన్న తెలుగు వారందరి కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అలాంటి ఈ సంస్థకు ప్రతీ రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2021లో తానా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయవం సాధించారు కృష్ణా జిల్లాకు చెందిన లావు అంజయ్యచౌదరి.
అంజయ్య చౌదరి కృష్ణా జిల్లా పెద అవుట్ పల్లి గ్రామానికి చెందిన వారు. 1988లో అమెరికా వెళ్లిన ఆయన ఉద్యోగం చేస్తూ తానాలో సభ్యుడిగా చేరారు. ఆనాటి నుంచి అమెరికాలో తెలుగువారి సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారు. అమెరికా వెళ్లి ఇబ్బందులకు గురయిన ఎన్నైరై తల్లితండ్రులకు సహాయం చేయటంలో విశేషంగా పని చేస్తున్నారు. అదే విధంగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను బారత్ కు తీసుకురావటంలో తనవంతు కృషి చేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకూ తానా స్క్వేర్ కు టీం ఛైర్మన్ అంజయ్య చౌదరి పని చేశారు. ఆ తరువాత కాలంలో తానాలో ఎన్నో బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా చేపట్టారు. 2019 నుంచి 2021 వరకూ తానా కార్యనిర్వాహక బృందంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2021లో తానా అధ్యక్షుడిగా ఎన్నికైన అంజయ్య చౌదరి 2023వరకూ కొనసాగుతారు. ప్రస్తుతం తెలుగువారి కోసం అమెరికాలో పని చేస్తున్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటన సందర్భంగా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తానా లైఫ్ టైం మెంబర్ తరణ్ కాకని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలను అంజయ్య చౌదరి మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు వారి కోసం చేస్తున్న సేవలను ప్రస్తావించారు. తానా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత మొదటిసారి ఇండియాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాలు అధ్యక్ష పదవీకాలం లో తెలుగు రాష్ట్రాల్లో తానా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రవాస భారతీయులకు టీమ్ స్క్వేర్ ఎన్నో సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేపడుతున్నామన్నారు. తానా అన్నపూర్ణ అనే కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో వున్న ఎంతో మందికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 25 కోట్ల రూపాయలతో రెండు తెలుగు రాష్ట్రాలకు మెడికల్ సపోర్ట్ ఎక్యుప్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. వచ్చే మూడవ వేవ్ కు కూడా సేవలు అందించటానికి సమాయత్తం అవుతున్నట్లు అంజయ్య తెలిపారు. రెడ్ క్రాస్ తో మాట్లాడి ఏ రకమైన మెడికల్ సపోర్ట్ కావాలో ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. మహిళలు, పిల్లలకు, విద్యార్థులకు తానా స్క్వేర్ ద్వారా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
తెలుగు భాషా,సాహిత్యం,పుస్తక మోహోద్యమం అనే కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. ఇందులో అత్యంత ఈజీగా తెలుగు నేర్చుకోవటానికి కరికులం తయారు చేశామన్నారు. అత్యంత సులువైనా ఆధునికమైన పద్దతిలో అందరూ తెలుగు నేర్చుకునేందుకు అమెరికాలో ప్రయత్నిస్తున్నామన్నారు. 2022 డిసెంబర్ లో తానా చైతన్య స్రవంతి జరగబోతుందని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సేవలు అందించటానికి… అమెరికాలో ఉన్న తెలుగువారి కోసం అహర్నిశలు పని చేయటానికి తానా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని లావు అంజయ్య చౌదరి చెప్పారు. తాను అధ్యక్షుడు కావటానికి సహకరించిన అందిరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ… తెలుగు వారి కోసం మరిన్ని మెరుగైన సేవలు అందించటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో పరిశీలిస్తున్నామని అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా లైఫ్ టైం మెంబర్ తరుణ్ కాకానీ AASRAA ( Advocates Association for Social Responsibility And Awareness) చేస్తున్న కార్యక్రమాలను తానా అధ్యక్షుడికి వివరించారు. దేశంలో నీతి అయోగ్ చే గుర్తించబడిన వినియోగదారుల హక్కుల అవగాహన అసోసియేషన్ అని తెలిపారు. ఈ సేవలను ప్రపంచ స్థాయిలో తానా ద్వారా అందించేందుకు తానా అధ్యక్షుడితో మాట్లాడారు. దీనికి సంబందించిన రిపోర్ట్ ను తరణ్ కాకాని తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరికి అందించారు. ఈ సేవలు ప్రపంచ వ్యాప్తం చేసేలు చర్యలు చేపడదామని అంజయ్య అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …