ఎస్పీని సన్మానించిన “పెన్”…


-ప్రజాహిత కార్యక్రమాలకు మీడియా సహకారముండాలి… : కృష్ణా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాహిత కార్యక్రమాలకు మీడియా సహకారముండాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆకాంక్షించారు. జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకు, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) సన్మానించింది. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలసిన ” పెన్” రాష్ట్ర అధ్యక్షుడు బడే ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతిరోజు స్పందన, అంతర్గత స్పందన, ఈచ్ వన్ టీచ్ వన్ వంటి కార్యక్రమాలతో పాటు అత్యాచార బాధితులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్న ఎస్పీ పోలీస్ శాఖ లో తెచ్చిన సంస్కారణలను ప్రశంసించారు.మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మచిలీపట్నం ఆసుపత్రి నుంచి అపహరించబడ్డ శిశువును కనుగొనటంలోను, అవనిగడ్డలో కిడ్నాపు గురైన బాలుని రక్షించే విషయంలో ఎస్పీ కృషిని కొనియాడారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ను శాలువాతో సత్కరించి సంఘ జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో “పెన్ “కృష్ణా జిల్లా అధ్యక్షుడు సనకా వెంకటనాధప్రసాద్, “పెన్ ” రాష్ట్ర సంఘ ట్రజరర్ రంగారావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *