Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి…

-ఈ నెల 5 వ తేదీ లోపు చర్చలకు పిలవాలి
-చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం
-సెప్టెంబర్ 5న రాష్ట్ర జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ
-ఏపీ జే ఏ సి జిల్లా చైర్మన్ డి ఎస్ ఎన్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఈ నెల 5 వ తేదీ లోపు ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని లేకుంటే జే ఏ సి రాష్ట్ర కమిటీ తీసుకున్న కార్యాచరణ లో భాగస్వామ్యులయ్యేందుకు సిద్ధం గా ఉండాలని జిల్లా జే ఏ సి చైర్మన్ డి .సత్యనారాయణ రెడ్డి పిలుపు నిచ్చారు. ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం బుధవారం విజయవాడలోని ఎన్‌జీఓ హోంలో జిల్లా జేఏసీ ఛైర్మన్ డి.సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం, ప్రభుత్వంతో చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవ్‌లు, పెండింగ్ బకాయిల చెల్లింపులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా ఉద్యోగులు సంయమనం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఉద్యోగ సంఘాలను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని జేఏసీ కోరింది. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే ఉద్యోగ సంఘాల తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జేఏసీ సంఘాలతో సమావేశమై ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్నప్పటికీ, పీఆర్సీ, డీఏలు, ఇతర బకాయిల విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కోరారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గాన్ని ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సెప్టెంబర్ 5న జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని నాయకులు తెలిపారు.

కో చైర్మన్ సయ్యద్ ఖాసీం మాట్లాడుతూ ఉద్యమాలు, సమ్మెలు జే ఏ సి కి కొత్తేమీ కాదని, అయితే ప్రస్తుతం సమస్యలు చర్చల దశలో ఉన్నందున ఇప్పటివరకు సంయమనం పాటిస్తున్నామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోతే రాష్ట్ర జేఏసీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఉద్యమ కార్యాచరణలో జిల్లా ఉద్యోగులు ఐక్యంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సమావేశం లో కో-ఛైర్మన్స్ పి.రమేష్ G. అనుగ్రహ ప్రసాద్ వైస్ చైర్మన్ జి.నారాయణరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ జి .రామకృష్ణ జాయింట్ సెక్రటరీ విష్ణువర్ధన్ రావు కార్యవర్గ సభ్యులు పి .నాగరాజు వి .శ్రీనివాసరావు వి.రాధిక కె.శివలీల బి.విజయశ్రీ సి హెచ్ శ్రీదేవి నజీరుద్దీన్ వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *