Breaking News

ఆహార, తాగునీటి భద్రతపై శానిటరీ ఇన్స్పెక్టర్లు సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తీసుకునే ఆహార, తాగునీటి భద్రతపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు సమగ్ర అవగాహన కల్గి ఉండి, ప్రజారోగ్యానికి భంగం కల్గించే వాటిని అడ్డుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు అన్నారు. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో పరిశుభ్రమైన ఆహారం, త్రాగునీటిని ప్రజలకు అందించేందుకు వార్డ్ ల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్లు తగు పర్యవేక్షణ చేయడానికి వీలుగా వారికి బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ, అధికారులు ఆహార తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలు, ఆర్ఓ ప్లాంట్లలో పరిశుభ్రత, నీటి నాణ్యత, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పరిశీలించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చట్టం–2006 ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *