Breaking News

నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా డివైడర్లలో అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, పార్క్ విభాగాల అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇంజినీరింగ్, పార్క్ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లతో ప్లాంటేషన్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ ని మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా, పిన్ పాయింట్ గా చేపట్టాలన్నారు. మొక్కల కోసం గోతులను ఇష్టానుసారం తవ్వకుండా డిగ్గింగ్ యంత్రాన్ని వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా నగరంలోని విద్యాసంస్థలు, ప్రధాన వ్యాపార సముదాయాలు, హాస్పిటల్స్ పరిసరాలతో పాటు అన్ని ముఖ్యమైన ప్రధాన రహదారులను కవర్ చేస్తూ ఈ ప్లాంటేషన్ విస్తృతంగా జరగాలన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, రక్షణకు తప్పనిసరిగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాంతాల వారీగా అవెన్యూ ప్లాంటేషన్ కాంట్రాక్టర్లకు 2 ఏళ్లు నిర్వహణ కూడా టెండర్ నిబందనలో ఉన్నందున అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడా నాటిన మొక్కలు ఎండి పోవడానికి వీలు లేదని, పార్క్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ శ్రీనివాస్, ఏడిహెచ్ శాంతి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *