Breaking News

అనేక విద్యార్హతలు.. ఒకే విశ్వవిద్యాలయంతో సుదీర్ఘ అనుబంధం

-డాక్టర్ రవికుమార్ బొప్పనకు ఘన సత్కారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పర్యాటక, ఆతిథ్య నిర్వహణ విభాగంలో బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు హాజరై తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి డాక్టర్ రవికుమార్ బొప్పనను విభాగాధిపతి ప్రొఫెసర్ పి. పూర్ణచంద్రరావు, సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.

డాక్టర్ రవికుమార్ బొప్పనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో సుదీర్ఘమైన విద్యా అనుబంధం ఉంది. ఇదే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆయన పలు ఉన్నత విద్యా కోర్సులను పూర్తి చేశారు. పర్యాటక, ప్రయాణ నిర్వహణలో ఎంబీఏ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో ఎంఏ, వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధిలో ఎంకామ్ తో పాటు అనుబంధ సిద్ధార్థ లా కళాశాల నుండి బీఎల్‌ అభ్యసించారు. సహకార నిర్వహణలో ఉన్నత డిప్లొమాను సైతం పొందారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలోని వాణిజ్య, వ్యాపార నిర్వహణ విభాగం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల నిర్వహణ వ్యూహాలు – సంప్రదాయ మాధ్యమాలపై వాటి ప్రభావం – ఒక విశ్లేషణ’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు.విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో విద్యను అభ్యసించిన డాక్టర్ రవికుమార్ బొప్పనకు ఈ సంస్థతో ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యార్థిగా తాను గడిపిన విశ్వవిద్యాలయ ప్రాంగణానికి పూర్వ విద్యార్థిగా తిరిగి రావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విభాగాధిపతి ప్రొఫెసర్ పి. పూర్ణచంద్రరావు, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఏ. రహిమాన్ సాహెబ్, అధ్యాపకులు డాక్టర్ జి. జ్యోతి, డాక్టర్ ఎన్. గీతా సోని, డాక్టర్ కె. రాజేష్, డాక్టర్ చ. రాజీవ్ తదితరులు డాక్టర్ రవికుమార్ బొప్పనను అభినందించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ అధ్యాపకులను, స్నేహితులను కలుసుకుని విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులతో నిరంతర అనుబంధాన్ని కొనసాగించడం ద్వారా విశ్వవిద్యాలయానికి, ప్రస్తుత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అధ్యాపకులు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *