Breaking News

ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించాలి… : వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యలవాడగా పేరు ప్రఖ్యాతిగాంచిన ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ పనితీరుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి పరోక్షంగా జిల్లా నగర మండల విద్యాశాఖ అధికారులు సహకరిస్తున్నారు అని జిల్లాలో జరుగుతున్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12 1 సి ప్రకారం ఎంతమందికి ఫేస్-1, ఫేస్-2లో ఉచితంగా అడ్మిషన్లు కేటాయించారో మండలాల వారీగా వివరములను తెలియపరచాలన్నారు. ఇన్చార్జి హెచ్ఎం లతో, ఇంచార్జ్ ఎంఈఓ లతో జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న జిల్లా పాఠశాల విద్యను రెగ్యులర్ హెడ్మాస్టర్లు, మండల విద్యాశాఖ అధికారుల నియామకంతో ఆర్డర్ లో పెట్టాలన్నారు.

డిమాండ్ :
చెట్టుకోక పుట్టపోక ప్రైవేట్ పాఠశాల ఉన్న జిల్లాలో కూడా విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12 1 సి ను విస్తృత స్థాయిలో అమలు చేయలేకపోయినా జిల్లా పాఠశాల విద్యాశాఖ. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నిర్వహణ యాజమాన్యాలకు ఫీజులు దోపిడీ వరంగాను, విద్యాశాఖ అధికారులకు కాసుల పంటగాను, విద్యార్థుల తల్లిదండ్రులకు శాపంగా మారింది.

విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12 1 సి ఉచిత అడ్మిషన్ల సమాచారానికి సంబంధించి ఏ పాఠశాల ఎంతమందికి చట్టం ప్రకారం అడ్మిషన్లు కేటాయించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభిన్న ప్రతిభావంతుల వర్గాలకు చెందిన చిన్నారులకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించింది అనే అంశంపై వివరణ ఇవ్వడంలో సమన్వయ లోపంతో పనిచేస్తున్న జిల్లా పాఠశాల విద్యాశాఖ, మండల విద్యా శాఖ, ఎన్టీఆర్ డిస్టిక్ ఆర్టిఇ నోడల్ ఆఫీసర్ కార్యాలయం.

జిల్లాలో జిల్లా నగర మండల విద్యాశాఖ అధికారులు కాసులకు కక్కుర్తి పడి పరోక్షంగా పలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారు అనీ జిల్లా నగర మండలాలలో పలు ప్రైవేట్ కార్పొరేటు పాఠశాలల్లో బహిరంగంగా జిల్లా విద్యాశాఖ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ యూనిఫాం పుస్తకాలు అమ్ముతున్న అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వ సెలవు దినాలలో స్పెషల్ క్లాసులు పరీక్షలు నిర్వహిస్తున్న ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదని ఎన్నోసార్లు మీడియా పరంగా ప్రజల పరంగా ఆరోపణలు వచ్చినా కూడా జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వెనుక ప్రజలలో వస్తున్న ఆరోపణలను అనుమానాలను రేకెత్తుతున్నాయని..జిల్లా వాసులలో రేకెత్తుతున్న అనుమానాలను ఆరోపణలను నివృత్తం చేసేందుకు విజిలెన్స్ అధికారుల చేత విచారణ చేపట్టి నిజానిజాలను బహిరంగపరచాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *