విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నెట్టెం శ్రీ రఘురామ్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురామ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవం, పరిపాలనా దక్షతకు పవన్ కళ్యాణ్ ప్రజా బలం, యువతలో ఉన్న విశ్వాసం తోడవడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడిందని నెట్టెం శ్రీ రఘురామ్ పేర్కొన్నారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఐక్యతే రాష్ట్ర ప్రగతికి బలం అని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరింత వేగంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నెట్టెం శ్రీ రఘురామ్ హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.
నెట్టెం శ్రీ రఘురామ్ సమక్షంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News