Breaking News

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం కబేళాకు సెలవు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జంతువుల వధ, మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 03-09-2026 (గురువారం) రాత్రి నుండి కబేలాలో ఎటువంటి జంతువులను వధించుటకు అనుమతి లేదని నగరంలో ఉన్న అన్ని చికెన్ షాప్లు మటన్ షాప్లు చేపల మార్కెట్లు తెరుచుటకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించినా, లేదా షాపులను తెరిచి ఉంచినా, ఏ విధమైన మాంసాహారంలను విక్రయించినా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజలు, మాంసం దుకాణాల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు నగరపాలక సంస్థ ఆదేశాలను పాటించి సహకరించాలని కమిషనర్ ధ్యానచంద్ర విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *