కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డు ప్రాంతాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బుధవారం పరిశీలించారు. గార్గేయపురం డంప్‌యార్డులో చెత్త బయో మైనింగ్ ప్రక్రియ, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ల పనులు జరుగుతున్నాయి. ఆ పనులను చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. కర్నూలు నగరపాలక సంస్థ (కేఎంసీ) ఆధ్వర్యంలో అత్యాధునిక వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరుని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఇంజనీరింగ్ అధికారులు చైర్మన్ పట్టాభిరామ్ కు వివరించారు.
Prajavartha Online Telugu News