Breaking News

యుద్ధప్రాతిపదికన నందికొట్కూరు డంపింగ్ యార్డ్ పనులు

-ఈ నెలాఖరికి చెత్త ప్రాసెసింగ్ కేంద్రం ట్రయల్ రన్ పూర్తి కావాలి
-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశాలు

నందికొట్కూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నంద్యాల జిల్లా నందికొట్కూరులోని డంపింగ్ యార్డ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశాలు అధికారులను, ఏజెన్సీవారిని ఆదేశించారు. నందికొట్కూరు మున్సిపాల్టీ పరిధిలోని డంపింగ్ యార్డ్ ని చైర్మన్ పట్టాభిరామ్ బుధవారం పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఆవరణలో కాంపౌండ్ వాల్, షెడ్ల నిర్మాణం, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, చెత్త శుద్ధి ప్లాంట్(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్) పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, పనులు ఇంకా వేగంగా జరగాలని, ఈ నెలాఖరు నాటికి చెత్త ప్రాసెసింగ్ కేంద్రం ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. డంపింగ్ యార్డ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణంతోపాటు గేటు, ఫెన్సింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే, ప్లాంట్ నిర్వహణకు కావలసిన 100కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, పవర్ సప్లై పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ప్రాసెస్ పై అవగాహన కల్పించేందుకు ఏజన్సీ ప్రతినిధులు ప్రత్యేకంగా ఒక రోజు వర్క్ షాపు నిర్వహిస్తారన్నారు. ప్లాంట్ నిర్వహణ సరిగాలేకపోతే, బాధ్యతలను వేరే ఏజన్సీలకు అప్పగిస్తామని హెచ్చరించారు. డంప్ యార్డులో ప్రతిరోజూ పనులు జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల వారు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చైర్మన్ పట్టాభిరామ్ కు ఫిర్యాదు చేశారు. స్థానికులకు ఇబ్బంది కలుగకుండా, దుమ్ముధూళి, దుర్వాసన వెలువడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీవారిని ఆయన ఆదేశించారు. స్థానికులకు ఇబ్బంది కలిగిస్తే, ఊరుకునేది లేదని పట్టాభిరామ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *