విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో అధికారం గా పర్యటించారు.
ఈ పర్యటనలో ఆయన రేషన్ షాపులు అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో భాగంగా సింగ్ నగర్ లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని సందర్శించారు, సింగ్ నగర్ 7 అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు పట్టిలో పిల్లల సంఖ్యకు మించి ఎక్కువగా నమోదు చేయటాన్నీ గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కేంద్ర నిర్వాహకురాలపై తగు చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగ్ నగర్ లో ఉన్న రేషన్ డిపో 0684101 తనిఖీ చేసిన ఆయన రేషన్ షాప్ తో కలిపి కిరాణా షాప్ ని నిర్వహించడాన్ని తప్పుపట్టారు. వెంటనే దీన్ని తొలగించాలని అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా షాప్ లో ప్లాస్టిక్ సంచులతో బియ్యం దాచి పెట్టడాన్ని గుర్తించిన ఆయన రేషన్ షాప్ డీలర్కి మెమో జారీ చేశారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే షాప్ లైసెన్స్ ని ని రద్దు చేస్తామని హెచ్చరించారు. నిడమానూరు లో ఉన్న రేషన్ షాప్ 0616005 తనిఖీ చేసి గోన సంచిలో ఉండవలసిన బియ్యం ప్లాస్టిక్ సంచుల్లో ఉండడాన్ని గమనించి సదరు డీలర్ కు మేము ఇవ్వాల్సిందిగా సివిల్ సప్లై అధికారులు నీ ఆదేశించారు. అనంతరం నిడమనూరు ఉన్నత పాఠశాల భోజన పథకాన్ని పరిశీలించి పిల్లలతో కలిసి ముచ్చటిస్తూ నేల మీద కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎదిగి సేవ చేయాలని హిత బోధ చేశారు. స్టాకు రికార్డులు పరిశీలించగా 600 చెక్కిలు అదనంగా ఉండడం గుర్తించి దీనిపై తగు వివరణ ఇవ్వవలసిందిగా డీఈవో చంద్రకళ నీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు ఐసిడిఎస్ అధికారులు విద్యాశాఖ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెత్రాలజీ అధికారులు బిసి సాంఘిక సంక్షేమ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News