విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ‘ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్’ ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభమైంది. బుధవారం బిఆర్‌టిఎస్ రోడ్డులో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతులమీదుగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలుదారులకు మంచి పళ్ళతో నాణ్యమైన ఐటమ్స్‌తో అందుబాటు ధరలో ప్రజలకు జ్యూస్, ఐస్‌క్రీమ్ అందించి వారి ఆరోగ్యానికి పాటుపడాలని కోరి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నిర్వాహకులు రాము, వరప్రసాద్, అశోక్ మాట్లాడుతూ నగరంలో ఇది రెండవ బ్రాంచ్ అని ప్రజల ఆదరాభిమానాలతో బిఆర్‌టిఎస్ రోడ్డులో ప్రారంభించామన్నారు. మా దగ్గర మన్నికైన పళ్ళతో, డ్రైఫ్రూట్స్‌తో మంచి క్వాలీటీతో జ్యూస్‌లు అందజేస్తామన్నారు. యాపిల్, చక్రకేళీ, సపోటా, కివీఫ్రూట్, బాదమ్, ద్రాక్ష, క్యారెట్ తదితర జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌లు, మిక్స్‌డ్ జ్యూస్ తదితర ఐటమ్స్, ఐస్‌క్రీమ్స్ అందుబాటులో వున్నాయన్నారు. మేం కస్టమర్లకు ఏం చెప్పామో ఆవిధమైన జ్యూస్ పూర్తిగా ఒరిజినల్ జ్యూస్ అందుబాటు ధరలో అందజేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా 1+1 ఆఫర్ కొనుగోలుదారులకు అందజేస్తున్నామన్నారు. వివాహాది శుభకార్యాలు, వివిధ రకాలైన ఫంక్షన్లకు ఆర్డరుపై కూడా సప్లయ్ చేస్తామన్నారు. అలాగే జోమాటో, స్విగ్గీ తదితర వాటి ద్వారా మా జ్యూస్‌లు అందజేస్తామన్నారు. మాకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా వుండి ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఎంతో రుణపడి వున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలుదారులు, నగర ప్రముఖులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News