Breaking News

భాజపా దక్షిణాది ‘సేవా సంకల్ప్’ సారథిగా సత్యకుమార్‌

-ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు ఇంచార్జ్‌
-కీలక బాధ్యతలు అప్పగించిన జాతీయ నాయకత్వం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న *‘సేవా సంకల్ప్ అభియాన్’* దక్షిణాది బాధ్యతలను భాజపా జాతీయ నేత, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది.
‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాల నిర్వహణ కోసం సత్య కుమార్ ను దక్షిణాది రాష్ట్రాల అభియాన్ ఇంచార్జ్‌గా పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. జాతీయ కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో పనిచేసిన అనుభవం, దక్షిణాది రాష్ట్రాల నాయకత్వంతో ఉన్న సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరితో పాటు అండమాన్, లక్షద్వీప్‌లలోనూ అభియాన్ కార్యక్రమాల సమన్వయం, అమలు బాధ్యతలను సత్యకుమార్ పర్యవేక్షించనున్నారు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నెల రోజుల పాటు బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రజా భాగస్వామ్యమే లక్ష్యం

ప్రజాసేవ, దేశాభివృద్ధి, ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడమే అభియాన్ ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

రాష్ట్రాల వారీగా కార్యశాలలు

అభియాన్ కార్యాచరణపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో నిర్వహించిన సన్నాహాక కార్యశాలల్లో సత్యకుమార్ పాల్గొన్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బుధవారం జరిగిన రాష్ట్రవ్యాప్త కార్యశాలలోనూ పాల్గొని, కార్యక్రమాల నిర్వహణ, ప్రజా భాగస్వామ్యం పెంపు, సేవా కార్యక్రమాల అమలుపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి

దక్షిణాది రాష్ట్రాల్లో అభియాన్‌ను విస్తృత స్థాయిలో నిర్వహించి, ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడంపై సత్యకుమార్ దృష్టి సారించనున్నారు. జాతీయ కార్యదర్శిగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల బీజేపీ శ్రేణులతో పనిచేసిన అనుభవం ఈ కార్యక్రమ సమన్వయంలో ఉపయోగపడనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *