-కొత్తపేట , శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ కృష్ణ జయంతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవములలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని శ్రీ వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాయి. ఆలయ కమిటి అధ్యక్షులు బురా కనకారావు, కార్యదర్శి మురపాల వెంకట దుర్గారావు కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News