Breaking News

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) , మహాదేవు అప్పాజీ రావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జనసేన నాయకులు తమ్మిన లీల కరుణాకర్ భవాని పురం ,ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 38 వ డివిజన్, రావి చెట్టు సెంటర్ కు చెందిన సల్లంగి నాగ తులసి (46) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.26 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు లింగం శివప్రసాద్, బొమ్ము రాంబాబు, ఏలూరి సాయి శరత్, బెవర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *