మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్టైమ్ సెటిల్మెంట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.
శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు.
తొలుత నవీన్ మిట్టల్ హమాలీ కాలనీకు చెందిన పలువురు మహిళలు మంత్రిని కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. వార్డు సచివాలయ వలీంటీర్ వచ్చి తమ వద్దకు వచ్చి మీరున్న స్థలం మీకు దక్కాలంటే అందుకు కొంత డబ్బు చెల్లించాలని అడుగుతున్నారని తమకు విషయం అర్ధం కాకపోవడంతో నేరుగా తాము మీ వద్దకు వచ్చినట్లు హిందీలో సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపై సంపూర్ణ హక్కు కల్పించే వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో డిసెంబర్ 21న ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కృత నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. 1983 నుంచి 2011 వరకూ వివిధ గృహ నిర్మాణ పథకాల ద్వారా రుణాలు తీసుకొని, ఇళ్లు నిర్మించుకున్నవారికి, ఒన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఆయా ఇళ్లు, స్థలాలను తమ పేరు మీద రిజిష్టర్ చేసుకొనే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని, తద్వారా దానిపై సంపూర్ణ హక్కులు కలుగుతాయని మంత్రి చెప్పారు . ఈ ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకం క్రింద, ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయడం జరుగుతుందని, ఈ నెల 21 వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను ప్రతి వార్డు లోనూ ప్రతి గ్రామంలో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందు కోసం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. పొదుపు డ్వాక్రా మహిళ లకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా తీసుకోవచ్చని మంత్రి అన్నారు అతి తక్కువ రుసుంతోనే, శాశ్వత హక్కును సంపాదించే ఈ పథకం క్రింద, ఎటువంటి రిజిష్ట్రేషన్ ఛార్జీలను చెల్లించ నక్కరలేకుండానే, తమ గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. రిజిష్ట్రేషన్ అనంతరం తమ ఇంటిని లేదా స్థలాన్ని అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చునని, లేదా కొత్తగా రుణాన్ని తీసుకోవచ్చని మంత్రి పేర్ని నాని సూచించారు. ఒకే విడతలో తమ రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేసుకొని, ఇంటిపై సంపూర్ణ హక్కులను కలిగించే ఈ గొప్ప అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మచిలీపట్నం మండలం కోన గ్రామానికి చెందిన పేరుబోయిన రామాంజనేయులు, అలాగే, మచిలీపట్నం బుట్టాయిపేటకు చెందిన కోరిసిక వేంకేటేశ్వరావులు మంత్రిని కలిసి తాము దివ్యాంగులమని తమకు కృత్రిమ కాలును అమర్చేలా వైద్యులతో మాట్లాడి సహాయం చేయాలని అభ్యర్ధించారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, మీ సమస్య విషయమై వైద్యులకు ఎవరికైనా చూపించారా ? అని అడిగి లేని పక్షంలో తనకు తెల్సిన కృత్రిమ అవయవాల నిపుణుడు ఒకరు పాలకొల్లు లో ఉన్నారని మీరు చేసే వృత్తిని తొలుత ఆ వైద్యుడు తెలుసుకొని ఆ తర్వాత ఆయన కృత్రిమ కాలును తయారుచేస్తారని మీరు ఇరువురు అక్కడికి వెళతారా అని అడిగి మీకు వైద్యానికి కృత్రిమ కాళ్ళకు అయ్యే ఖర్చులు నేనే భరిస్తా అని అన్నారు.
స్థానిక హోసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెద్దిబోయిన సాంబ శివరావు అనే ఆటో కార్మికుడు మంత్రి పేర్ని నానిను కలిశారు. తన కుమార్తె బి టెక్ చదువుకొందని ఇటీవల ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పడిందని ఆ పోస్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిందని ఆమెకు ఆ ఉద్యోగం వచ్చేలా సహాయం చేయమని కోరారు. స్థానిక పరాసుపేటకు చెందిన పాలపర్తి సౌజన్య అనే మహిళ మంత్రిని కలిసి ప్రభుత్వాసుపత్రిలో అవుట్ సోర్సింగ్ నర్స్ ఉద్యోగం దయచేసి తనకు ఇప్పించాలని కోరింది.
Tags machilipatnam
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …