Breaking News

టిడ్కో నివాసాలకు సంబందించి జరుగుతున్న డాక్యుమెంటేషన్ విధానము పరిశీలన…

-17 మందికి లోన్ మంజూరు పత్రాల పంపిణి
-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో నివాసాలకు సంబందించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసి 17 మందికి నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్., చేతుల మీదుగా బ్యాంక్ అఫ్ బరోడా అధికారులు లబ్దిదారులకు లోన్ మంజూరు పత్రాల అందజేసినారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నగరపాలక సంస్థ మరియు బ్యాంకు అఫ్ బరోడా సంయుక్తoగా నిర్వహించిన మెగా లోన్ మేళ నందు నగరంలోని 768 మందికి బ్యాంకు లోన్ కొరకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికీ లోన్ మంజూరు చేయుట జరిగినది. ఈ సందర్భంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పేదలకు ఇల్లు పథకం ద్వారా అర్హులైన వారికీ ఉచితంగా స్థలములను అందించుట జరిగిందని అన్నారు. అదే విధంగా ఎక్కువ చ.మీ గల నివాసాలకు సంబందించి ప్రభుత్వం సబ్సిడీ పోను మిగిలిన 5400 గృహాల లబ్దిదారులకు సులభమైన పద్దతిలో ప్రతి నెల బ్యాంక్ వారికీ జమ చేసేలా ప్రభుత్వం బ్యాంక్ నుండి బుణ సౌకర్యం కల్పించుట జరుగుతుందని పేర్కొన్నారు. దీనికొరకు సింగల్ విండో సిస్టం పద్దతిలో లబ్దిదారులకు ఒకే రోజున లోన్ మంజురుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని దానిలో భాగంగా నేటి లోన్ మేళ నందు 14 బ్రాంచ్ ల ద్వారా రూ.26.10 కోట్ల ఋణాల మంజురుకు కావలసిన ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. గతంలో యునియన్ బ్యాంక్ ద్వారా కొంత మందికి బుణాలు మంజూరు చేయుట జరిగిందని, త్వరలో కెనర బ్యాంక్ నుండి కూడా ఇదే విధంగా బుణ మేళ చేపట్టుట జరుగుతుందని అన్నారు. అదే విధంగా రాజశేఖర్, DGM బ్యాంక్ అఫ్ బరోడా మాట్లాడుతూ 384 మందికి 365 చ.మీ వారికీ రూ.3,15,000/- మరియు 384 మందికి 430 చ.మీ వారికీ రూ.3,65,000/- బుణముల కొరకు బ్యాంక్ బ్రాంచిల వద్దకు వెళ్ళకుండా ఒక రోజులో బ్యాంకర్లు మరియు నగరపాలక సంస్థ సిబ్బంది అన్ని రకముల దరఖాస్తులు పూర్తి చేసినట్లు మిగిలిన వారికీ కూడా సత్వరమే పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమములో ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జె అరుణ, రాజశేఖర్, DGM బ్యాంక్ అఫ్ బరోడా గారితో పాటుగా 14 బ్యాంక్ మేనేజర్లు, 32 మంది రిసోర్స్ పర్సన్స్, సి.ఓ మరియు సి.డి.ఓ నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *