-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
7వ డివిజన్ పరిధిలోని 37వ వార్డ్ సచివాలయమును కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసి సచివాలయ సిబ్బంది విధుల హాజరు పై ఆరా తీసారు. ప్రతి ఒక్కరు అంకిత భావంతో విధి నిర్వహణ చేయవలెనని, వార్డ్ వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా పౌర సేవలు ప్రజలకు సత్వరమే అందునట్లు చూడవలెనని పేర్కొన్నారు. సోమవారం జరుగనున్న మెగా వాక్సినేషన్ డే పై ప్రజలందరికీ అవగాహన కల్పించి తప్పక వాక్సినేషన్ వేయించుకోను నట్లుగా చూడాలని అన్నారు. సచివాలయ ప్రత్యేక అధికారులు సిబ్బందితో సమావేశములు ఏర్పాటు చేసి ప్రత్యేక మెగా వాక్సినేషన్ డ్రైవ్ పై ప్రజలను చైతన్య వంతులను చేయవలసినదిగా ఆదేశించినారు.