విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ మేదర సురేష కుమార్ ప్రగాఢ సంతాపాన్నిఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మేదర సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పలుమార్లు ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా ఆయన ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావానికి రోశయ్య పెట్టింది పేరని పేర్కొన్నారు. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని, సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, మంచి వక్తగా పేరు గడించారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్య ఆర్థిక మంత్రిగా పని చేశారన్నారు. ఎందరికో రాజకీయాల్లో రోశయ్య ఆదర్శనీయులన్నారు . అలాంటి వ్యక్తి మరణం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …