-ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు , సంస్థలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విజ్ఞప్తి
-ఇంధన పరిరక్షణ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన సంస్థలు, పరిశ్రమలకు అవార్డులు
– ఇంధన పరిరక్షణ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించటమే లక్ష్యం
-ఇంధన సామర్థ్యంతో రాష్ట్రంలో ఇంధన భద్రత, ఆర్థికాబివృద్ధి
-ఇంధన డిమాండుకు చవకైన, తక్షణ పరిష్కారం ఇంధన సామర్ధ్యమే
-ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయముతో ఇంధన సామర్ధ్య కార్యకమాలన్ని విజయవంతం చేయాలి
-నాణ్యమైన చౌక విద్యుత్ సాధించాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి ఇది దోహదం
-పరిశ్రమలు , భవన నిర్మాణం, మునిసిపల్ రంగాలలో ఇంధన సామర్థ్యం సాధించడం పై ప్రత్యేక ద్రుష్టి– ఇంధన శాఖ కార్యదర్శి, శ్రీకాంత్ నాగులాపల్లి
-సెక అవార్డుల దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 08.12.2021 వరకు పొడిగించబడింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగంలో రాష్ట్రం సాధించిన ఉత్తమ విజయాలను ఈ నెల 14 నుంచి జారగబోయే ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలముందు తీసుకు రానుంది. ఇందులో భాగంగా ఇంధన పరిరక్షణ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన సంస్థలు, పరిశ్రమలకు అవార్డులను బహుకరించాలని ఏపీఎస్ఈసిఎం నిర్ణయించింది. తద్వారా ఇతరులకు స్ఫూర్తి కలిగించటంతో పాటు ఇంధన పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ అవార్డుల పోటీలో మరింత ఎక్కువ మంది పాల్గొనేలా వీలు కల్పిస్తూ ఈ పోటీ లో దరఖాస్తు చేసుకునే తేదీని 8 డిసెంబర్ -2021 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీఎస్ఈసిఎం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ఏపీఎస్ఈసిఎం చైర్మన్ సమీర్ శర్మ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో ప్రజలను పెధ్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. అవార్డుల కార్యక్రమంతో పాటు మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టి వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు . రాష్ట్రంలో డిసెంబర్ 14 నుంచి మొదలయ్యే వారోత్సవాలపై చర్చించేందుకు రాష్ట్ర ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి , ఇతర అధికారులతో జరిగిన చర్చలో ఆయన ఈ సూచనలు చేసారు.
ఇంధన సామర్థ్యం పై ప్రజలు ,ప్రభుత్వ శాఖలు , ప్రైవేట్ సంస్థలలో పెధ్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నానాటికి పెరుగుతున్న ఇంధన డిమాండును అందుకునేందుకు, ఇంధన భద్రత, ఆర్థికాబివృద్ధి సాదించేందుకు ఇంధనం పై వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్ధ్య చర్యలు దోహదపడతాయని ఆయన వివరించారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పై సానుకూల ప్రభావం పడుతుందని, రాష్ట్రంలో పర్యావరణాన్ని మెరుగు పరచుకోవచ్చునని ఆయన అన్నారు . దీని వల్ల రాష్ట్రం లో ప్రతి కుటుంబం , ప్రతి సంస్థ ప్రయోజనం పొందుతాయని వివరించారు . ప్రధానంగా పెరుగుతున్న ఇంధన డిమాండుకు చవకైన, తక్షణ పరిష్కారం ఇంధన సామర్థ్యమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయముతో ఇంధన సామర్ధ్య కార్యకమాలన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తద్వారా రాష్ట్రంలో నాణ్యమైన చౌక విద్యుత్ సాధించాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి ఇది దోహదపడుతుందని ఆయన వివిరిచారు. ఇంధన వనరులను సమర్ధవంతంగా, పొదుపుగా వినియోగించుకోవటం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడటమేగాక భవిష్యత్ తరాలకు ఇంధన కొరత నివారించవచ్చని పేర్కొన్నారు . ప్రజల దైనందిత జీవితాల్లో ఇంధన పరిరక్షణ ఒక భాగం కావాలని ఆయన విజ్ఞప్తి చేసారు . ఇంధన సామర్థ్యం, ఇంధన పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజలను పెధ్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.
ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేలా సహకరించాల్సిందిగా అన్నిప్రభుత్వ శాఖలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, పభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. ఇంధన సామర్ధ్య రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను ప్రదర్శించడంలో భాగంగా పరిశ్రమలు , భవన నిర్మాణం, మునిసిపల్ రంగాల పై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఆయా రంగాలలో ఉత్తమ పని తీరు కనబరిచిన సంస్థలకు అవార్డులు బహుకరించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా 15000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసే అవకాశముందని ఆయన తెలిపారు.
పరిశ్రమలు, భవన నిర్మాణం , మునిసిపల్ రంగానికి సంబందించిన వివిధ సంస్థల మధ్య పోటీ నిర్వహించబడుతోంది. పరిశ్రమల కేటగిరీ కింద టెక్స్టైల్, సిమెంట్ , సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు , అలాగే సంస్థల కేటగిరీ కింద మున్సిపాలిటీలు/పట్టణ స్థానిక సంస్థలు, అలాగే హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి వాణిజ్య భవనాలు, ప్లాజాలు, యూనివర్సిటీలు మరియు ఇంజనీరింగ్ కాలేజీలు (ప్రభుత్వ & ప్రైవేట్ రెండూ) భవనాల కేటగిరీలలో పోటీ నిర్వహిస్తారు .
పారిశ్రామిక రంగం కింద, మొత్తం వార్షిక ఇంధన వినియోగం 3000 టీన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ ( టీఓఈ) లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సిమెంట్ పరిశ్రమలు, 1500 టీ ఓ ఈ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక ఇంధన వినియోగం కలిగిన టెక్స్టైల్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలలో 1000 కె వీ ఏ మరియు అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భవనాల విభాగం కింద, వాణిజ్య భవనాలు, హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్/ప్లాజాలు, యూనివర్సిటీలు, 100 kW/120kW లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, 50 KW కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన లోడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు. మరియు పట్టణ స్థానిక సంస్థలు (ULBలు)/మునిసిపల్ కార్పొరేషన్లు/మునిసిపాలిటీలు, మురుగు నీటి పంపింగ్ బోర్డులు, తాగునీటి సరఫరా బోర్డులు దరఖాస్తు చేసుకోవచ్చు.APSECA 2021 దరఖాస్తు మార్గదర్శకాలు వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. https://www.apsecm.ap.gov.in/ , https://www.apeasternpower.com/ , https://apcpdcl.in/ , https://www.apspdcl.in/
పూరించిన దరఖాస్తు ఫారమ్ను ఇమెయిల్-ఐడి ద్వారా APSECM చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు సమర్పించాలి: seca.apsecm@gmail.com మరియు ఇమెయిల్-ఐడి: ceo.secm@gmail.comకి, సబ్జెక్ట్ ఫీల్డ్లో “Application for SECA 2021”గా పేర్కొనవలెను . దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 03.12.2021, ఇప్పుడు 08.12.2021 వరకు పొడిగించబడింది. సంబంధిత వర్గాల కోసం క్రింద పేర్కొన్న దరఖాస్తు ఫారమ్ లింక్ ద్వారా దరఖాస్తును సమర్పించవచ్చు.
● Industrial Category: https://ces.asci.org.in/survey/application-for-industrial-category/
● Building Category: https://ces.asci.org.in/survey/application-for-buildings-category/
● Urban Local Bodies: https://ces.asci.org.in/survey/application-for-urban-local-bodies-category/