ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
మూలా నక్షత్రం సందర్భంగా రుద్ర హోమం జరుగు యాగశాల యందు సరస్వతీ యాగం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమి నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మహా పూర్ణాహుతి కార్యక్రమముతో సరస్వతీ యాగం మరియు కార్తీక మాస ఉత్సవములు దిగ్విజయంగా ముగిసినవని ఆలయ స్థానాచార్యులు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు, అమ్మవారి కంకణము, ఫోటో ప్రసాదంగా చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి పంపిణీ చేయడం జరిగింది.
Tags indrakiladri
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …