విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రన్ ను నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ ఈ రన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఐపీఎస్ అయ్యనార్ సమక్షంలో టీఆర్ఎ స్ రోడ్, పడవలరేవు సర్కిల్ వద్ద నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ అయ్యనార్, ఐపీఎస్ సమక్షంలో బీఆర్డీఎస్ రోడ్, గుణదల దగ్గర రన్ ఫర్ హెల్త్ (ఆరోగ్యం కోసం పరుగు) ను మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ నిర్వహించింది. అమరావతి రన్నర్స్ , రెడ్ ఎఫ్ఎం 93.5 మరియు డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మణిపాల్ హాస్పిటల్స్ యొక్క 15వ వార్షికోత్సవ సందర్భంగా సమాజంలో ఆరోగ్యం పట్ల అవగాహన మెరుగుపరిచేందుకు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్), డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ మాట్లాడుతూ “మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న 5కె&10కె రన్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా వుంది. ఇక్కడ ఉత్సాహభరితమైన వాతావరణాన్ని చూస్తుంటే నాకు కన్నుల పండుగ గా వుంది. ఈ రన్ ద్వారా ఆరోగ్యంగా ఉండటం అలాగే ఫిట్ గా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఈ రన్ లో అమరావతి రన్నర్స్ తో పాటు అనేక వాకర్స్ క్లబ్ లు పాల్గొనడం ఎంతో ఆనందంగా వుంది.రన్ లో పాల్గొనే వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.
డాక్టర్ సుధాకర్ కంటిపూడి, హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్స్ మాట్లాడుతూ “మా 15వ వార్షికోత్సవ సందర్భంగా, మణిపాల్ హాస్పిటల్స్ వద్ద మేము రోగి సంరక్షణ మరియు సౌకర్యానికి అమిత ప్రాధాన్యత ఇస్తున్నాము మరియు మానసికంగా, శారీరకంగా వారి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాము. మా క్లినికల్ నైపుణ్యంతో తమకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది సహాయంతో మేము అసాధారణ మైలురాళ్లను చేరుకోగలిగాము మరియు ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ సేవలను అందించడం కొనసాగించడం ద్వారా విజయం సాధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. ఈ రతను 10 కిలోమీటర్లు మరియు 5 కిలోమీటర్ల దూరం నిర్వహించారు. 1600+ మంది పాల్గొనడం ద్వారా ఇది అపూర్వ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, రన్నర్స్, ఫిట్నెస్ సెంటర్స్ నిర్వాహకులు/సభ్యులు, వాకింగ్ క్లబ్స్ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్ క్లబ్ మొదలైన వారు పాల్గొన్నారు.
ఈ రన్ లో విజేతలుగా నిలిచిన వారికి కార్యక్రమ ముగింపు వేడుకలో కృష్ణా జిల్లా కలెక్టర్ , జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ జె నివాస్, ఐఏఎస్ బహుమతి ప్రదానం చేశారు. వార్షికోత్సవ వేడుకలో భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, ఎన్సీఏ – హెడ్ శ్రీ వీవీఎస్ లక్ష్మణ్ ఈ రన్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతితో సత్కరిస్తారు.వార్షికోత్సవ వేడుకను మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ 15వ వార్షికోత్సవానికి ప్రతీకగా డిసెంబర్ 11వ తేదీ నిర్వహించనున్నారు