Breaking News

కొవ్వూరు నియోజకవర్గంలో వాడ వాడల అంబేద్కర్ వర్ధంతి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి గర్వపడుతున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశ భవిష్య నిర్మాణానంలో మనం ఆశించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వలలో పెను మార్పులు సంభవించడానికి? ఆరాధ్యుడు డా.బి ఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయసాధనకు తార్కాణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళలకు మొదటి క్యాబినేట్ నుంచి పెద్దపీట వేశారని, ఇది తమకు ఎంతో గర్వకారణం గా ఉందని మంత్రి పేర్కొన్నారు. న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న మరణించారని ఆయన వర్ధంతిని మహాపరినిర్వాన్ దివస్’గా నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. సమస్యల్ని ఎదిరించేందుకు సరైన మార్గాన్ని ఎంచుకోక, తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతూ.. నిర్వీర్యమవుతున్న యువతకి అలాగే ఇతర బలహీన వర్గాలకు అంబేద్కర్ జీవితం ఒక చైతన్య బాటను చూపుతుందని ఆమె తెలిపారు. చిన్నతనం నుంచి ఎన్నో అవాంతరాలను అవమానాలు ఎదుర్కొంటూ అసాధ్యాలను సుసాధ్యంగా మలుస్తూ.. ఆర్థికవేత్తగా, న్యాయశాస్త్ర నిపుణుడిగా, రాజనీతిజ్ఞుడిగా, సంపాదకుడిగా, ఉపాధ్యాయుడిగా, హక్కుల నేతగా, ప్రపంచ మేధావిగా, స్వాతంత్ర ఉద్యమకారుడిగా, భావి భారత నిర్మాతగా ఇలా తాను ఎదిగిన తీరు చూపిన బాట అన్ని వర్గాల వారికి ఆదర్శనీయం, ఆచారణీయం అని తానేటి వనిత తెలిపారు. ఆనాడు అంబేద్కర్ చదివే రోజుల్లో ఇటువంటి ప్రోత్సాహకాలు ఉండేవి కావని, నేడు రాష్ట్రంలో అంబేద్కర్ ఆశించిన సంక్షేమ పాలన జరగడం, ఆ మంత్రి వర్గం లో తాను పనిచెయ్యడం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం, అంబేద్కర్ ఆశయాలు, జ్యోతిరావు ఫూలే మహిళా లకు విద్య వంటివి మన ప్రభుత్వ హయాంలో సాకారం అవుతున్నాయన్నారు. పేదరికం ఉండకూడదు అని, చదువుకోవడానికి పేదరికం ఆటంకం కారదన్నదే ముఖ్యమంత్రి ఆశయ మన్నారు. నేడు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో వాడ వాడల, మండలాల్లో, గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నా మని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, జెడ్.పి. టి. సి., బొంతా వెంకట లక్ష్మి, మాజీ యం.ఎల్.సి. కోడూరి శివరామ కృష్ణ, మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవి, చాగల్లు యంపిపి, మట్టా వీరాస్వామి, కౌన్సిలర్ లు ఆర్. భాస్కర రావు, అక్షయ పాత్ర శ్రీనివాస రవీం ద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *