-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…
-థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందున ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…
-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలి ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీలో పెండింగ్ లో లేకుండ పరిష్కరించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మేంట్ (ఓటీఎస్) తో రుణమాఫీ చేసి లబ్దిదారుల స్థిరాస్థులపై ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తుందని ఈ అవకాశాన్నిలబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వివిధ పథకాలు ద్వారా 2012 సంవత్సరానికి ముందు ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులు గృహనిర్మాణ సంస్థ ద్వారా ఎంత రుణం తీసుకున్నప్పటికీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) కింద నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తే వారి ఇంటిపై సంపూర్ణ హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. లబ్దిదారుల ఇళ్ళకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజును అందిస్తుందని ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సాధారణంగా అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువపై 7.5 శాతం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రస్తుతం అటువంటి ఛార్జీలు ఏమీలేకుండా వారి స్థిరాస్తిని గ్రామ సచివాలయంలోనే రిజిష్టరు చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్దిదారులకు ఎంతో మేలు చేసే ఈ పథకం డిశంబరు 20 వరకు అమల్లో ఉంటుందన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. కోవిడ్ కట్టడే లక్ష్యంగా షాఫులు, వాహనాలు, వ్యాపార వాణిజ్య సంస్థంలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నోమాస్క్ నో రైడింగ్”, “నోమాస్క్ నో సేల్” బోర్డులను ప్రదర్శిస్తూ వినియోగదారులుకు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ పోయిందని ఎవరూ భావించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నరు. కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ.సి.గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.