-ప్రారంభోత్సవ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన రోడ్లు భవనాలు శాఖ మంత్రి శంకరనారాయణ,రవాణా,ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి యం.టి. కృష్ణబాబు, సియం కార్యక్రమాల సమన్వయకర్త , ఎమ్మెల్సీ తలశిల రఘురాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 1045 కిలోమీటర్ల మేర రహదారులు, ప్లైఓవర్లు రాష్ట్ర ప్రజలకు అందుబాటు లోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి యం. శంకరనారాణ చెప్పారు.
సోమవారం స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 10 వతేదీ ఉదయ 10 గంటలకు కేంద్ర రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, కేగంద్ర టూరిజం శాఖ మంతి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రూ. 16,920 కోట్ల రూపాలయతో పూర్తి చేసిన, శంకుస్థాపన చేసే 41 ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి శంకరనారాయణ చెప్పారు. సమన్వయం సమావేశంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి యం.టి. కృష్ణబాబు, సియం కార్యక్రమాల సమన్వయకర్త , ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే మల్దాది విష్ణు తదితర అధాకారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి రోడ్ల అభివృద్ది కొసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కనక్టవిటీలేని రహదారులను జాతీయ రహదారులకు అనుసందానం చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే ఈస్ట్రన్ బైపాస్ నుండి విజయవాడ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై బ్రిడ్జి, రహదారిని అభివృద్ది చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరిని కోరతారని తెలిపారు. ఆనందపురం జన్షన్ – భీమిలి మీదుగా విశాఖపట్నం పోర్టుకు చేరేందుకు ఆరు లైన్ల రోడ్ల నిర్మాణం మంజూరు చేయాల్సిందిగా, విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 కు రీఅలైన్మెంట్ కావాలని , అమరావతి మాస్టర్ ప్లాన్ గ్రిడ్ రోడ్ కు అనుసందానం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కేంద్రమంత్రిని కోరతారనన్నారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రారంభించే రోడ్లు ఇలా ఉన్నాయి…
చిత్తూరు – మల్లవరం రహదారి 2,331కోట్లతోను ప్రారంభిస్తారు. గుండుగొలను – దేవరపల్లి- కొవ్వూరు మద్య 70 కిలోమీటర్ల 4 రోడ్ల రహదారిని రూ. 2,677 కోట్లతో ప్రారంభిస్తారి. అలాగే జ్యోతి మహాల్ – రమేష్ ఆస్పత్రి జంక్షన్ వరకు నిర్మించిన 2.5 కి.మీ. ప్లైఓవర్ ను రూ. 96 కోట్ల తో నిర్మించిన ప్రజలకు అంకితం చేస్తారు. అలాగే ఇచ్చాపురం – నర్సరావుపేట మద్య నాలుగు రోడ్ల రహదారిని రూ. 577 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డును ప్రారంభిస్తారు. నందిగామ బైపాస్ – కంచికచర్ల బైపాస్ మద్యనున్న రెండు లైన్ల రహదారిని ఆరు లైన్లకు రూ. 425 కోట్లతో విస్తరిస్తారు. అలాగే జాతీయ రహదారులకు చెందిన రీజనల్ కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. అలాగే రూ.1295 కోట్లతో రహదారుల పునరుద్దరణ, అభివృద్ది చేసిన గిద్దలూరు – పెనుగొండ –వినుగొండ రహదారి పల్వనేరు – కృష్ణగిరి రహదారి, అనంతపూర్ – గుంటూరు రహదారులను కూడా ఈ సందర్బంగా ప్రారంభిస్తారు.
అలాగే శంకుస్థాపన చేసే వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి…
చిత్తూరు – తట్చూరు ఆరు లైన్ల రహదారిని రూ. 3,180 కోట్ల రూపాయలతో మూడు ప్యాకేజ్ లుగా నిర్మాణం చేపడతారు. అలాగే రూ. 1281 కోట్లతో నిర్మించే ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్ట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే నాగార్జునసాగర్ డామ్ – దేవులపల్లి – భద్రాచలం – కుంట – రాయచోటి – వేంపల్లి – ముక్కలూరు – మధనపల్లి –దుత్తలూరు – కావలి రహదారులను పునరుద్దరణ, విస్తరణ కార్యక్రమాలనురూ.2118 కోట్లతో చేపడతారని తెలిపారు.
ఈ సందర్బంగా 10 వ తేదీన జరిగే పలు కార్యక్రమాలకు సంబందించి ఎగ్జిబిషన్ ఏర్పాట్లు, వేదిక తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే జాతీయ రహదారుల అధికారులు ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ చక్కటి ఫోటోలతో,సమాచారంతో రూపొందించమని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి యం.టి. కృష్ణబాబు, సియం కార్యక్రమాల సమన్వయకర్త , ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే మల్దాది విష్ణు. జాయింట్ కలెక్టరు( అభివృద్ది) ఎల్. శివశంకర్, వియంసీ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, డీసీపీ విష్ణువర్థనరాజు, జాతీయ రహదారుల అధికారులు శ్రీనివాస్, ఏవీ నారాయణ, డీటీసీ విజయవాడ భీమారావు, ఆర్ ఆండ్ బీ ఎస్ ఈ వెంకటేశ్వరరావు, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.