Breaking News

డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యుద్ధ వితంతువులు, వీరమాతలు, వికలాంగులకు సంఘీ భావాన్ని తెలిపేందుకు డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని బిగ్రేడియార్, వణుకూరి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కే. పి నగర్ లో గల సమావేశ మందిరంలో సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ ద్వారా అమరులైన వీర సైనిక యోధుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వెంకటరెడ్డి వివరిస్తూ…… యుద్ధ వితంతువులు, వీరమాతలు, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయంగా ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడం జరుగుతున్నదన్నారు.అదేవిధంగా అనాధ పిల్లల కొరకు ప్రత్యేక గ్రాంటుగా నెలకు రూ. 1000/- లు, వికలాంగుల కొరకు, మాజీ విధి నిర్వాహకులకు ఆర్ధిక సహాయంగా జీవిత కాలం పాటు నెలకు రూ. 4000/- లు, వీర మరణం పొందిన సైనికుల కుటుంబీకుల అంత్య క్రియల కొరకు రూ. 5,000/- లు, వితంతువు మరణిస్తే రూ. 3,500/- లు, అమరులైన సైనికుల పిల్లలు మరణిస్తే రూ. 2,500/- లు ఆర్ధిక సహాయం చెల్లించడం జరుగుతున్నదని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అమరులైన సైనికుల బిడ్డలా విద్యా బోధన కొరకు ఏడాదికి రూ. 4,000/- లు చొప్పున మరియు హాస్టల్ వసతి కొరకు సంవత్సరానికి రూ. 5,000/- లు చొప్పున, వితంతువులకు సంవత్సరానికి రూ. 4,800/- లు చొప్పున పెన్షన్ రూపంలోనూ, వితంతువులకు చిన్న వ్యాపారాల కొరకు రూ. 6,000/- లు (వన్ టైం గ్రాంట్)అమరులైన సైనికుల కుటుంబాల లోని వివాహ వేడుకలకు గాను కుమార్తెకు రూ. 4,000/-లు, కులాంతర వివాహం నాకు రూ. 10,000/-లు, వితంతువు పునర్ వివాహమునకు రూ. 20,000/- లు, మాజీ సైనికుని కుటుంబ పరమైన కేసులకు సంబంధించి న్యాయ పరమైన ఆర్ధిక సహాయం కొరకు రూ. 5,000/- లు చెల్లించడంతో పాటు సంబంధిత కుటుంబంలోని బిడ్డలు వృత్తి విద్య కోర్స్ లలో నిర్వహించే ప్రవేశ పరీక్షలలో అత్యధిక రాంక్ సాధించిన ఇ ఎస్ ఎమ్ పిల్లలకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు, సైనిక కుటుంబాలలో ఆర్ధిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ జి ఓ లు ఏడాదికి రూ. 50/- లు, గజెటెడ్ అధికారులు రూ. 100/-లు చొప్పున విరాళం అందించడం జరుగుతున్నదని వెంకటరెడ్డి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2వ ప్రపంచ యుద్ధం వీరులైన మాజీ సైనికులు, వారి వితంతువులకు ఆర్ధిక సహాయంగా ప్రతి నెలా రూ. 5,000/- లు అందించడం జరుగుతున్నదని, 2020-21 సంవత్సరంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన నలుగురు రక్షణ సైనిక సిబ్బందికి ఎక్స్ గ్రేషియో గా రూ. 50 లక్షల మొత్తాన్ని మంజూరు చేయడం జరిగిందని వెంకటరెడ్డితెలిపారు.
కేంద్ర సైనిక బోర్డు న్యూ ఢిల్లీ వారి ఆర్ధిక సహాయంలో భాగంగా ఎడ్యుకేషన్ గ్రాంటు రూపంలో సైనికుల కుటుంబం లోని ఇద్దరు పిల్లలకు వార్షిక సహాయంగా రూ. 12,000/-లు అందించబడుతుంది. ఇ ఎస్ ఎమ్ గ్రాంటుగా వివాహ నిమిత్తం కుటుంబం లోని ఒక్క కుమార్తెకు రూ. 50,000/- ఆర్ధిక సహాయం, పెన్యూరి గ్రాంటుగా వితంతువులకు సంవత్సరానికి రూ. 48,000/-లు, వైద్య చికిత్సల కొరకు ఏడాదికి సాధారణ వైద్యం కోసం రూ. 30,000/-లు ఆర్ధిక సహాయం అందించ బడుతుంది. 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యంతో సర్వీస్ నుండి రిటైర్ అయిన వికలాంగ వ్యక్తులకు స్కూటర్ కొనుగోలు నిమిత్తం రూ. 57,500/-లు ఆర్ధిక సహాయం, ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ పధకం క్రింద 2020-21 విద్యా సంవత్సరానికి బాలురకు రూ. 30,000/- లు, మరియు బాలికలకు రూ. 36,000/-లు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతున్నదని వెంకటరెడ్డి వివరించారు.
సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 7వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖా మాత్యులు  మేకతోటి సుచరిత సత్కరించే వారిలో…..
* 2020-21 లో తమ భర్తలను కోల్పోయిన నలుగురు వీరనారీలు.
* 2021 లో తన కొడుకును కోల్పోయిన ఒక వీర మాత.
* రక్షణ సిబ్బంది మరియు కుటుంబ సంక్షేమం కోసం 2021 లో గరిష్టంగా నిధులు సేకరించిన ముగ్గురు జిల్లా కలెక్టర్ లు.
* ముగ్గురు జిల్లా సైనిక సంక్షేమ అధికారులు.
* నేటికి 124 సార్లు రక్త దానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మాజీ సైనికుడు సార్జెంట్ బోడేపల్లి రామకృష్ణా రావు లను సాయుధ దళాల పతాక దినోత్సవం నాడు సత్కరించు కోవడానికి సైనిక సంక్షేమ శాఖ నిర్ణయించినట్లు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులు ఎమ్. భాస్కర నారాయణ సైనిక వెల్ఫేర్ ఫండు అందించారు.
మీడియా సమావేశంలో సైనిక సంక్షేమశాఖసహాయ సంచాలకులు వి. వెంకట రాజారావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *