మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
3వ డివిజన్ వలంద పాలెం గంగులతోటలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి పేర్ని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని శనివారం స్థానిక 3వ డివిజన్ వలందపాలెం గంగుల తోటలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ లేకపోవడంతో వర్షం పడితే రోడ్లపైకి నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని పాముల బెడద, పందుల బెడద ఎదుర్కొంటున్నామని మంత్రికి వివరించారు. డ్రైనేజీ నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని, పందుల బెడద నివారణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
మౌనిక లేఅవుట్ లో పర్యటించిన మంత్రి
అనంతరం మంత్రి మౌనిక లేఅవుట్ లో పర్యటించి అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని మంత్రికి వివరించగా, మంత్రి సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులతో చర్చించారు. నెల రోజుల క్రితమే మౌనిక లేఅవుట్ డెవలపర్స్ త్రాగునీటి సరఫరాకు కాలనీ తరఫున డబ్బు చెల్లించారని మున్సిపల్ అధికారులు మంత్రికి వివరించారు. రెండు రోజుల్లో తాగునీటి పైప్లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించాలని అని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వారంలో రెండు సార్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు ఇకనుంచి రోజు విడిచి రోజు సరఫరా చేయాలని మంత్రి సూచించారు. తాగునీటి పైప్ లైన్ పనులు సరిగా జరిగేలా లెవెల్స్ చూసుకోవాలని కాలనీ అభివృద్ధి కమిటీ వారికి మంత్రి సూచించారు.
Tags machilipatnam
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …