జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21 న తణుకు నుంచి ప్రారంభం…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21 న తణుకు నుంచి ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు పేర్కొన్నారు. శనివారం తణుకు ఇంద్రయ్య కాలేజి లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి హెలిప్యాడ్, సభావేదిక లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 52 లక్షల మంది కుటుంబాలకు మేలు చేసే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి పాల్గొనుచున్న తొలి భారీ సమావేశం కాగా, ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం కావడం విశేష మన్నారు. ఆరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలియజేసేలా, స్థానిక శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలని, గృహ నిర్మాణ శాఖ మంత్రి గా కోరిన వెంటనే ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలపడం జిల్లా మంత్రి గా ఎంతో ఆనందం కలిగిందన్నారు. కేవలం పది రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసి లబ్దిదారుడు కు అందచేస్తామన్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ చెపితే రిజిస్ట్రేషన్ శాఖ ప్రవేటు ఆస్తులకు ఏ విధమైన విధివిధానాలు ఉంటాయో, అవి వీటికి కూడా కల్పిస్తున్నామన్నారు. సంబంధించిన స్థలాలు, ఇంటిపై ఈ సి సర్టిఫికెట్ బ్యాంకు నుంచి రుణాలు, వేరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంద్రయ్య కాలేజిలో సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే పూర్తిగా మాఫీ చేస్తానని ప్రతిపక్ష నాయకుడు చెబుతున్నారు, అయితే 2014 నుంచి 2019 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసారని ప్రశ్నించారు. అప్పుడు వడ్డీ మాఫీ కోసం విజ్ఞప్తి చేసినా ఒప్పుకోలేదని, సుమారు 43 667 మంది లబ్ధిదారులు అసలు, వడ్డీ కట్టి డి ఫారం పట్టా తీసుకుని వెళ్లారని పేర్కొన్నారు. అటువంటి వారికి ఆ భూములు, ఇళ్ళు పై ఎటువంటి హక్కులేకుండా ఉన్నారని చెప్పారు. కొందరు వాటిని బదలాయింపు చేసే అవకాశం లేకపోయినా వేరొకరికి అమ్ముకోవడం జరిగిందని, అటువంటి వారి విషయంలో కూడా ముఖ్యమంత్రి అర్హులైన వారికి వారి పేరునే , వారి వారసుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసి అందచేసేందుకు ముందుకు వొచ్చారన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ఓటీఎస్ ప్రయోజనం పొందాలని కోరారు. ఈ పర్యటన లో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా , జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ స్థానిక శాసనసభ్యులు, కారుమూరి నాగేశ్వరరావు , అధికారులు , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *