అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వీర సైనికుడు సాయి తేజ అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. శనివారం పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం .హరినారాయణన్ ల తో కలసి కురబలకోట మండలం రేగడపల్లి లో సాయి తేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు.సాయితేజ చిత్ర పటానికి నివాళి అర్పించారు .ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. దేశ రక్షణరంగంలో విశిష్టమైన సేవలను సాయి తేజ అందించారని వారి సేవలను ఎన్నటికి మరవలేమని , విలువ కట్టలేనివని ఆయన సతీమణి శ్యామల, ఆయనపిల్లలను, తల్లీతండ్రులను దేశ సేవలో ఉంటున్న సాయి తేజ సోదరుడు మహేష్ లను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం జరిగిందని, సాయి తేజ సతీమణి కి ఉద్యోగం కావాలని కోరడం జరిగిందని దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పడం జరిగిందన్నారు. ఆయన చేసిన సేవ ముందు మనం ఎంత చేసినా తక్కువే అవుతుందని వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.
Tags amaravathi
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …