-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యమైన డీజిల్, పెట్రోల్ ఇక్కడ లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించి తద్వారా లాభాల బాటలో పయనించి, రైతులకు మేలుచేసేవిధంగా పెట్రోల్ బంకును నిర్వహించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కలిదిండి పిఏసీఎస్ అధ్యక్షురాలు ఊర కళ్యాణి, సోసైటీ బ్యాంక్ మేనేజర్ పీవీవీ సత్యనారాయణల ఆధ్వర్యంలో పడమటపాలెం పంచాయతీలోని కలిదిండి సోసైటీ పెట్రోల్ బంక్ పునః ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మేల్యే డిఎన్ఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కలిదిండి సోసైటీ త్రి సభ్య కమిటీ చైర్మన్ శ్రీమతి ఊర కళ్యాణి, బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో రూ.18లక్షలు నిధులతో, కలిదిండిలో సోసైటీ పెట్రోల్ బంక్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా రైతులకు మంచి అవకాశం అని ఈ యొక్క పునః ప్రారంభం చేయడం ద్వారా రైతులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్, అందుతుందన్నారు. ఈ సోసైటీ బంకు 1995 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, కలిదిండి సోసైటీ 1959 లో ప్రారంభం అయి, ఇప్పటికి రైతులకు అనేక సేవలు అందిస్తుందన్నారు. సోసైటీ లో 2375 మంది సభ్యులు సభ్యులు షేరు ధనం రూ. 69లక్షలు 70వేల రూపాయలు వుందని, సోసైటీ బ్యాంక్ సొంత నిధులు రూ.3కోట్లు ఉందన్నారు. ప్రస్తుంత ప్రారంభించిన బంక్ జీతాలు, ఖర్చులు పోను రూ. 15లక్షలు రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న రైతుల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారని, ముఖ్యంగా మన ప్రాంతం అక్వా రంగం పైన ఎక్కువ ఆధారపడి ఉంటుందన్నారు. సన్న చిన్న రైతులకు రూ. 1.50 పైసలకు యూనిట్ కరెంట్ ప్రభుత్వం ఇస్తుందని, అదేవిదంగా రైతుల పంటకు ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ కట్టి, పంట నష్టం కలిగితే ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందన్నారు, మన కృష్ణాజిల్లా బ్యాంక్ చైర్మన్ తన్నేరు నాగేశ్వరరావు ఇటీవల కోరుకొల్లు సోసైటీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డీఫామ్ పట్టాలకు కూడా లోనులు ఇవ్వాలని నేను కోరగా తక్షణమే స్పందించి బ్యాంక్ ఉన్నతధికారుల సమావేశంలో మనం చెప్పిన డీ ఫామ్ పట్టాల రుణాలు ఒక్కొక్క పట్టాకి రూ. 1లక్ష.60వేల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు. అనంతరం కలిదిండి మండల నాయకులు పోసిన చెంచురామారావు, పోసిన రాజీవ్ భరత్ లు ఎమ్మెల్యే డిఎన్ఆర్ కు శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేసి సన్మానించారు.
తొలుత పీఏసీఎస్ అధ్యక్షురాలు ఊర కళ్యాణి శ్రీధర్ లు, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, సర్పంచ్ లు, మసీముక్కుల మారుతీప్రసన్న, సాన మీనా సరస్వతి, ఎంపీటీసీలు నీలి సుమన్, మహ్మద్ చాన్ బాషా, టెక్కిం శ్యామ్, రావాడి బాలు, గోదావరి సత్యనారాయణ, పీఎసీఎస్ అధ్యక్షులు, వడ్లని పార్ధసారధి,దాసరి చార్లెస్, కూరెళ్ల రాజారత్నం, అంకేం నరసయ్య, సాగి చిన్నబ్బాయిరాజు, బొర్రా ఏసుబాబులకు శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వడుపు రామారావు, చిట్టూరి మురళీకృష్ణ, చెన్నంశెట్టి కోడందరామయ్య,పంజా రామారావు, గోరిపర్తి సుబ్బారావు, నంబూరి బాబీ,, పెద్దిరెడ్డి శ్రీనివాస్, నున్న భగవాన్, నీలపాల సుబ్బయ్య, భాస్కర వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, మోకా రామకృష్ణ, గద్దె ఆనంద్, నరహరశెట్టి నరసయ్య, అనపర్తి వడ్డీకాసులు, బత్తిన ఉమా, మహాదేవ విజయబాబు, గండికోట ఏసుబాబు, షేక్ చాన్ బాషా, కందుల వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి నాగరాజు, చెన్నంశెట్టి సోమేశ్వరరావు, కట్టా లక్ష్మయ్య,బోయిన సత్యనారాయణ, సాగి వాసురాజు,కరేటి భాస్కర్, గుడివాడ ఫణి, గోదావరి సత్యనారాయణ, తట్టిగోళ్ళ నాంచారయ్య, బోయిన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.