Breaking News

విజయవాడ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడమే ధ్యేయం…

-మున్సిపల్ శాఖా మాత్యులు బొత్స సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా 14వ ఆర్ధిక సంఘ నిధుల నుండి రూ.100 లక్షల వ్యయంతో ఆధునీకరించిన రాఘవయ్య పార్క్ నందలి వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ మొదలగు వాటిని మరియు రూ.50.96 కోట్ల ప్రభుత్వ గ్రాంటు మరియు నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి రూ. 243 లక్షల అంచనాలతో చేపట్టిన దండమూడి రాజగోపాలరావు ఇన్ డోర్ స్టేడియం నందలి ఆధునీకరణ పనులను మంత్రి  బొత్స సత్యనారాయణ దేవాదాయశాఖ మంత్రి వర్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజక వర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, మేయర్  భాగ్య లక్ష్మీ, కమిషనర్  ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు  శైలజా రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్లు లతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేసి వాటిని వదిలి వేయకుండా ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం హర్షనీయమని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసికొని ముందుకు వెళుతున్న అధికారులను అభినందించారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి లక్ష్మo నగరాభివృద్ధి అని, విజయవాడ నగరంలో శంఖుస్ధాపనలు చేసినా, ప్రారంభోత్సవాలు చేసినా అది తమ ప్రభుత్వమునకు మాత్రమే సాధ్యమని, గతంలో ఏదైనా అభివృద్ది పనులు సంవత్సరాల తరబడి కొనసాగేవి అని అన్నారు. కోటి రూపాయిలతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు రాఘవయ్య పార్క్ ని‌ ఆధునీకరించి ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చాం, రెండున్నర కోట్లతో ఇండోర్ స్టేడియంని అభివృద్ది చేశాం, అభివృద్దే ధ్యేయంగా సిఎం  వైఎస్ జగన్ విజయవాడ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే మా ప్రభుత్వం ఉద్దేశం, అని పేర్కొన్నారు

అదే విధంగా మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారుల సౌలభ్యం కొరకు ఎంతో సౌకర్యవంతముగా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ స్టేడియoను ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకొవాలని అన్నారు. అదే విధంగా నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుటతో పాటుగా చిన్న పిల్లలను ఆకర్షించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రధాన పార్క్ లను ఆధునీకరించుట జరుగుతుందని, దానిలో భాగంగా రాఘవయ్య పార్క్ నందు వాకింగ్ ట్రాక్, పాత్ వే, ఫుడ్ కోర్ట్, ఎంట్రి మరియు సీటింగ్ ప్లాజా, చిన్నారుల ఆటపరికారాల ఏర్పాటు, ఆకర్షనీయమైన పెయింటింగ్, గ్రీనరీ మొదలగునవి ఏర్పాటు చేసి పార్కులను ఆహ్లాద వాతావరణంలో తీర్చిదిద్దటం జరిగిందని సెంట్రల్ నియోజక వర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణువర్ధన్ అన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదములు తెలిపినారు. ఆధునీకరించిన ఇన్ డోర్ స్టేడియం నూతన షటిల్ కోర్టు నందు శాసనసభ్యులు  మల్లాది విష్ణు, కమిషనర్  ప్రసన్న వెంకటేష్ షటిల్ ఆడినారు. కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్లు మొహమ్మద్ రేహానా నాహిద్, నెలిబండ్ల బాలస్వామి లతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, కో.అప్టేడ్ మెంబర్లు మరియు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *