పల్లెలలో తాగునీటి సమస్య ఎట్టి పరిస్థితులలో తలెత్తకూడదు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కంకణం కట్టుకుందని, పల్లెలలో తాగునీటి సమస్య ఎట్టి పరిస్థితులలో తలెత్తకూడదని గ్రామీణ నీటి సరఫరా శాఖాధికారులకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇటీవల ఏర్పాటు చేసిన పైప్ లైన్ కు పలుచోట్ల లీకులవ్వడం, వాల్వ్ లేకపోవడంతో వదిలిన నీరు వాడపాలెం సంప్ లోనికి చేరుకోవడం తప్ప తమ ప్రాంతంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ లోనికి తాగునీరు ఎక్కడం లేదని ఎన్. గొల్లపాలెం గ్రామ సర్పంచ్ బండి దేవానందం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై వెంటనే స్పందించిన మంత్రి ఆర్ డబ్ల్యు ఎస్ జె ఈ సుగుణతో ఫోన్లో మాట్లాడి సంబంధిత కాంట్రాక్టర్ ను పిలిపించి లీకులను తక్షణమే సరిచేయించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందన్నారు. రాష్ట్రంలో ప్రజల తాగునీటి అవసరాల ను తీర్చడానికి తీసుకున్న నిర్ణయంతో బోర్లు, బావుల నుండి నీటిని తెచ్చుకునే పరిస్థితికి చెక్ పడనుందని చెప్పారు. ప్రజల తాగునీటి అవసరాలతో పాటుగా, రోజువారి సాధారణ అవసరాలకు కావలసిన నీటిని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా అందించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 95 .66 లక్షల ఇళ్లు ఉంటే ఇప్పటివరకు 31.93 లక్షల ఇళ్లలో నీటి కుళాయిలు ఉన్నాయిని, నీటి సౌకర్యం లేని 63 .73 లక్షల ఇళ్లకు మంచి నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇందుకోసం ప్రణాళికలు సైతం సిద్ధం చేసిందని మంత్రి పేర్ని నాని వివరించారు. మచిలీపట్నం మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి దుర్గారావు మంత్రికి తన సమస్య చెప్పుకొన్నారు. తమ తొమ్మిదేళ్ల కుమారుడు అవినాష్ కు పుట్టుక నుంచి వినికిడి సమస్య ఉందని దివ్యాంగులకు వచ్చే పింఛన్ దయచేసి ఇప్పించాలని అభ్యర్ధించారు. ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన తన భర్త గొరిపర్తి గోవిందరాజులు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడని దాంతో నడుము కిందభాగంలో దెబ్బలు తగిలాయని ఆర్థో ఆపరేషన్ రెండుసార్లు జరిగిందని , దాంతో ఆసుపత్రిలో ఎంతో వ్యయం అయ్యిందని అయ్యాయని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆసుపత్రి ఖర్చులు ఇప్పించాలని మంత్రి పేర్ని నానిను ఆ మహిళ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *