విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ వైద్యులకు వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో మంగళవారం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని శ్రీ తన్మయి ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ సెంటర్ ఆధ్వర్యాన ‘ఆయుర్వేదం-ఆరోగ్యం’ అనే అంశంపై గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ వైద్యుల సంఘం అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సదస్సులో శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దేశీయమైన ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర కీలకమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే గ్రామీణ వైద్యులకు గుర్తింపు లభించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారని.. వీరంతా సంఘటితంగా తమ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళితే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ముందు ఉంటారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పి. రత్నకుమారి, సంఘం నాయకులు ఎం.ఎన్.రాజు, పి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, కోశాధికారి శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం, ఆర్ఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …