అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సి. అమలుపై ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి కెవివి సత్యనారాయణ అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం గురువారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో జరిగింది. సుమారు పదహారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు స్లాట్లలో మూడు గ్రూపులుగా జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల పిఆర్సి అమలుకై ఫిట్మెంట్ నిర్ణయం, పిఆర్సి, మానిటరీ బెనిఫిట్ అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుండి ఉద్యోగులకు అందజేయాలనే తదితర అంశాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వారిరువురు సమగ్రంగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్బంగా ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సంప్రదింపులు, చర్చలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటాయని, ఇందులో భాగంగానే పిఆర్సి అమలుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు, చర్చలు జరిపేందుకే ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాద్యమైనంత త్వరగా పి.ఆర్సి ని అమలుచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. పిఆర్సి అమలుకై ఫిట్మెంట్ నిర్ణయం, పిఆర్సి, మానిటరీ బెనిఫిట్ అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుండి ఉద్యోగులకు అందజేయాలనే అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన తదుపరి, వారు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని ఆయన పేర్కొన్నారు.
ఈసమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు)పి.చంద్రశేఖర్ రెడ్డి,ఎపి జెఎసి, ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక,ఎపి సచివాలయం సంఘం,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంట్రామిరెడ్డి, సూర్యనారాయణ, మిగతా ఉద్యోగ సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …