-దేవాదాయ శాఖా మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు,
-నియోజకవర్గాన్ని ఆదర్శంగా తిర్చిదిద్దుతాం… నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి రూ. 36 లక్షల అంచనా విలువలతో 45వ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ నందు బి.టి రోడ్లు మరియు డ్రెయిన్లు నిర్మాణము పనులకు గురువారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ తో కలసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గo లోని 22 డివిజన్ లలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి పరచుట జరిగిందని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చేపట్టిన అన్ని పనులను కూడా సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావటం జరుగుతుందని అన్నారు. నియోజక వర్గ పరిధిలోని త్రాగునీరు, రోడ్లు, డ్రెయినేజి మొదలగునవి అభివృద్ధి పరచుట జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా మా ప్రభుత్వ వచ్చిన తదుపరి ఈ డివిజన్ నందు రూ 17 కోట్ల తో చేపట్టిన పలు అభివృద్ధి పనులు అన్నియు సత్వరమే పూర్తి చేయుట జరుగుతుందని, నేడు చేపట్టిన రోడ్ మరియు డ్రెయిన్ నిర్మాణ పనులు కూడా నెలరోజులలో పూర్తి చేయుట జరుగుతుందని పేర్కొన్నారు.
అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి యే ద్యేయంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాల మెరుగుదలకై మంత్రి సహకారంతో చర్యలు తీసుకోవటం జరిగిందని పేర్కొన్నారు. గత నెల రోజుల క్రితం క్షేత్ర స్థాయి పర్యటనలో ఈ ప్రాంత ప్రజలు మంత్రి కి రోడ్లు మరియు ఏర్పాటు చేయాలని కోరటం జరిగిందని, వాటికీ కార్యరూపం దాల్చి నేడు మంత్రి చే శంకస్థాపన చేయటం సంతోషకరమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంత్రి గారి సహకారంతో రాభోవు రోజులలో పశ్చిమ నియోజకవర్గన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శoగా నిలుస్తుందని అన్నారు. డివిజన్ అభివృద్ధి కి తమ సహకరిస్తున్న మంత్రి మరియు నగర మేయర్ కి స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధూరి లావణ్య కృతజ్ఞతలు తెలియజేసారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధూరి లావణ్యతో పాటుగా పలువురు కార్పొరేటర్లు మరియు నగరపాలక సంస్థ ఎస్ .ఇ నరశింహ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తు మరియు ఇతర అధికారులు సిబ్బంది, స్థానిక వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.