రవాణాశాఖ సర్వర్ డౌన్ పై వాహనదారులు ఆందోళన చెందరాదు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో సర్వర్లు గురువారం ఉదయం నుండి ఆకస్మికంగా నిలిచిపోయి పౌరసేవలు స్తంభించాయిని తాత్కాలికంగా ఏర్పడిన అవాంతరాలపై ప్రజలు వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని సోఫ్త్వేర్ నిపుణులు సర్వర్ల లోని లోపాన్ని సరిదిద్దెందుకు తీవ్రంగా యత్నిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తున్నవారికి టీ ఆర్ రిలీజ్ చేయడంలో గానీ, రిజిస్ట్రేషన్లు చేయడంలో సాంకేతిక కారణాల వల్ల సర్వర్లు డౌన్లోడ్ అయినట్లు రోజంతా సేవలు నిలిచిపోయినట్లు మంత్రి అన్నారు. డిసెంబర్ 31 వ తేదీ లోపున వాహన కొనుగోలుదారులు డీలర్ ఇచ్చిన తమ వద్ద ఉన్న ఇన్ వాయిస్ పత్రం ఉన్నా, అలాగే ఇన్సూరెన్స్ పత్రంసైతం డిసెంబర్ 31 వ తేదీన కానీ అంతకు ముందు కానీ ఉంటే లేదా సి ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్ లోకి వెళ్లి వాహన యజమాని పేరు, వాహన ఛాసిస్ నెంబర్ కొడితే టాక్స్ ఎంత కట్టాలో అక్కడ ఉంటుందని అక్కడ కనుక వాహనదారులు చెల్లించినట్లయితే, జనవరి 1 వ తేదీ 2022 తర్వాత సైతం మీ వాహనంకు డిసెంబర్ 31 వ తేదీన ఏ పన్ను ఉందొ అదే పాత టాక్స్ అదే ధరకు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయబడిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇన్ వాయిస్ , డిసెంబర్ 31 వ తేదీ లోపు ఆ ముందు రోజులలో ఇన్సూరెన్స్ పత్రాలు, సి ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్ లో మీరు చెల్లించిన నగదు తాలూకా చలానా ఈ మూడు అంశాలు ఉంటే జనవరి 1 వ తారీఖు తర్వాత కూడా పాత టాక్స్ లకె రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఈ ఆదేశాన్ని ఇప్పటికే వివిధ జిల్లాల రవాణాశాఖ అధికారులకు , డీలర్లు అందరికి తెలియచేసినట్లు మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *