స్త్రీలు 67 శాతం రిజర్వేషన్‌ పొందినపుడే వారి అభివృద్ధి మొదలవుతుంది… : గాంధీ నాగరాజన్‌


-జనవరి 3న సావిత్రి భాయ్‌ పూలే జన్మదినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మహిళ దినోత్సవాన్ని అన్ని వర్గాల మహిళలను గౌరవించే దినోత్సవంగాను జరుపుకోవాలని అదే విధముగా మహిళలు అభివృద్ధిని సాధించాలంటే 33 శాతం రిజర్వేషన్‌ ఉంటే కాదు, అది 67 శాతం పొందినపుడు మాత్రమే వారి అభివృద్ధి జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్‌ విజ్ఞప్తి చేశారు. జనవరి 03, 2022న జరగబోయే సావిత్రి భాయ్‌ పూలే జన్మదినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ ఎవరు ఏది చేయలేదని మనం భావిస్తున్నామో అది మనం ఎందుకు చేయకూడదనే విశ్వాసంతో గాంధీ దేశం ట్రస్ట్‌ స్థాపించబడిరదని, మహిళలు లేనిదే ఏది లేదని ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, సతీమణిగా వివిధ రూపాలల్లో స్త్రీ తన శక్తిని అంతటా ధారపోస్తుందన్నారు. అలాంటి మహిళలుత ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్‌ కూడా పొందలేని పరిస్థితులలో ఇప్పుడున్నారన్నారు. లాలించటానికి తల్లి కావాలి కానీ పాలించటానికి తల్లి అవసరం లేదా… అది మారాలంటే స్త్రీలు 67 శాతం రిజర్వేషన్‌ పొందినపుడే వారి అభివృద్ధి మొదలవుతుందన్నారు. జనవరి 3 ,2022 న ఉదయం 10 గంటల నుండి ట్రస్ట్‌ చిరునామా (డోర్‌ నెం. 76`16`41, ఊర్మిళానగర్‌, రెడ్డికాలనీ, రామాలయం రోడ్డు, వాటర్‌ ట్యాంక్‌ బి ప్రక్కన) నందు వివిధ రంగాలలో వున్న అన్ని స్థాయిల మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని జరుపుతున్నామని, అని వృత్తుల మహిళలు ఆహ్వానితులేనని ఈ కార్యక్రమం బి.భారతి, ఎం.శ్రీదేవిల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేబీ జనని, మాస్టర్‌ కార్తీతో పాటు వ్యక్తిగత కార్యదర్శి ప్రణవ్‌ జైసూర్య, వి.రమేష్‌లు, కార్యదర్శిలు షేక్‌ జుబేధా బేగం, కె.సౌజన్య, ఆర్‌.అపర్ణలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *