-జగన్న ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల సంఖ్యా 62 లక్ష్యాలు
-దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేస్తున్న వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక పధకం క్రింద నగర పరిధిలో పాత పెన్షన్ దారులతో పాటుగా నూతనంగా మంజూరు కాబడిన 2541 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ. 2,500/- పెన్షన్ పంపిణి కార్యక్రమమును పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 50వ డివిజన్ 170 సచివాలయము నందు దేవాదాయశాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు స్థానిక కార్పొరేటర్ తో కలసి కొత్తగా మంజూరు కాబడిన 38 మందికి మరియు పాత పెన్షన్ దారులకు నగదు పంపిణి చేయు కార్యక్రమమును ప్రారంభించారు. ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల పేదలకు, వితంతులు, వికలాంగులకు, వై.ఎస్.ఆర్ పెన్షన్ రూ. 2,500/- ఇస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నదేనని అన్నారు. ప్రతి నెల ఒకటోవ తేదిన ఖచితంగా పంపిణి చేయుట గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టుట జరుగుతుందని మా ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని కొనియాడారు.
అదే విధంగా సెంట్రల్ నియోజక వర్గ పరిధిలో శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ స్థానిక కార్పోరేటర్లతో కలసి 32,33,29 మరియు 1 వ డివిజన్ల పరిధిలోని పాత వాటితో పాటుగా 141 పెన్షన్ లను మరియు తూర్పు నియోజకవర్గం పరిధిలో 10,11, 13, 9 మరియు 14 వ డివిజన్ లలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణి కార్యక్రమములో వై.ఎస్.ఆర్.సి.పి ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ పాల్గొని పాత వాటితో పాటుగా కొత్త మంజూరు కాబడిన 158 పెన్షన్లను లబ్దిదారులకు అందజేసారు.
పై కార్యక్రమములో ప్రాజెక్ట్ అధికారి (యు.సి.డి ) టి.సుధాకర్ పాల్గొన్నారు.