అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంతో కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోఖియా రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తరపున సీఎంకి గవర్నర్ స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రికి వేద పడింతుల ఆశీర్వచనం…
నూతన సంవత్సరం సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎంకు అందించారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.